పలాసను జిల్లాగా చేయాలి

* న్యూస్ చానల్స్ ప్రతినిధులు ఉద్ఘాటన

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 8 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస జిల్లా కావాలంటూ గతంలో పలాస జిల్లా కొరకు చర్చా వేదిక వంటి కార్యక్రమాలు చేసిన ఐదు న్యూస్ ఛానెల్స్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం ప్రజలకు ఇప్పటివరకు అన్యాయమే జరిగిందని ఆరోపించారు. కనీస మౌలిక వసతులకు కూడా లేవని,.గత ముప్పై ఏళ్లుగా కిడ్నీ సమస్య ఉద్దానాన్ని పట్టిపీడిస్తున్న పరిస్థితి.నిరుద్యోగ సమస్య,వలసలతో ఉద్దానం సతమతమవుతుందనీ అన్నారు. వంశధార నీరు నీరు చివరి ప్రాంతం వరకు వెళ్లే పరిస్థితి లేదని, రాష్ట్రానికి, ఇటు జిల్లాకు చివరప్రాంతం కావడంతో,అభివృద్ధిలో కూడా చివరకే ఉండిపోయింది. జిల్లా కేంద్రం దూరం కావడం ఇచ్చాపురానికి నిత్యం ఇబ్బంది కలిగే పరిస్థితి. అభివృద్ధికి అమడదురంలో ఉన్న ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, మెలియాపుట్టి తదితర మండలాలు అభివృద్ధి బాట పట్టాలంటే ఖచ్చితంగా పలాస జిల్లా కావాల్సిందే నని,. అందుకు నాటి చర్చావేదికలో ప్రజా సంఘ నాయకులు అయితేనేమి,విద్యార్థి సంఘ నాయకులైతేనేమి,పలువురు పెద్దలు సూచించిన విధంగా పలాస జిల్లా పోరాటం కొరకు, త్వరలో ఓ నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీని కొరకు త్వరలో ఏర్పాటు చేయనున్న సమావేశానికి అందర్నీ ఆహ్వానించననున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ పోరాటంలో చేయి కలపాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలిపారు. కార్యక్రమంలో న్యూస్ ఫోకస్ చేరుకుపల్లి. నేతాజీ, ఆర్ ఎన్ టివి కొంచాడ. రవి శంకర్, ఎస్.ఆర్ టివి రాజేంద్రప్రసాద్ సురో,వన్ నేషన్ న్యూస్ గుంట. సుభాష్ చంద్ర బోస్, ఎస్డీ న్యూస్ సిరిపురం సంతోష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *