పయనించే సూర్యుడు ఏప్రిల్ 8-04-26 కొమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్ జై నూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్ధన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సూటిప్రశ్న ఎన్నికల్లో ఇచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యే డిమాండ్* వార్తా విశ్లేషణ :జైనూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నేడు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి 14 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన లక్ష రూపాయలు తప్ప… ఈ ప్రభుత్వం ఇస్తానన్న తులం బంగారం ఇవ్వాలని, ఆరు గ్యారంటీలు అని చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో జైనూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

