ఉప్పర్ పల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 8 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఉప్పరపల్లి గ్రామ   రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో ద్వితీయవార్షికోత్సవ వేడుకలు ఉప్పర్ పల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధానార్చకులు శాస్టుర్ల రాజేశ్వర్ శర్మ మాట్లాడుతూ ఉప్పర్ పల్లిలో శ్రీ జమదగ్ని రేణుక ఎల్లమ్మ కొలిసిన వారికి కొంగుబంగారమై నిలుస్తుందని సంతానం లేని వారు ముడుపులు కట్టితే సంతానం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మొదలుకొని నేడు రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించ జరిగిందన్నారు.     ఆదివారం నుండి మొదలుకొని గణపూజ, పోచమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి మాతమ్మ తల్లికి బోనాలు తదితర కార్యక్రమాలలో భాగంగా నేడు మంగళవారం రోజున శ్రీశ్రీశ్రీ జమదగ్ని ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కపకు పాత్రులు అయినారని అన్నారు. కులమాతాలకతీతంగా  పాల్గొని అమ్మవారి పారాయణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *