పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 08 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణానికి చెందిన కడకుంట్ల జగదీశ్వర్ శ్వేతల వివాహ వార్షికోత్సవం సందర్భంగా చింతలూరు గ్రామంలో గల రెండు నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ వేడుకల పేరా డబ్బులు వృధా చేసే బదులు అర్హులైన పేదలకి చేతనైనంత సహాయం అందించాలని సూచించారు నాయకులు భానోత్ రామేష్ మాట్లాడుతూ పేదల పట్ల మానవత్వంతో స్పందిస్తూ గత అనేక సంవత్సరాలుగా కడకుంట్ల జగదీశ్వర్ శ్వేతా దంపతులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అని సాటి మనిషికి సహాయం చేయాలనుకునే మంచి గుణం ఉండడం హర్షనీయం ఆయన అని అన్నారు వారితో పాటుఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రావు, సుధాకర్, కళ్లెం శ్రీనివాస్ గౌడ్ చింతకుంట సాయికుమార్, వాసరి రవి, ఇమ్మడి విజయ్ కుమార్,యాచమనేని కిరణ్ బాబు, పడాల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు