ప్రజారోగ్యంపై అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు: ఏప్రిల్ 8/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె.విజయబాబు పెనుబల్లి మండలం పరిధిలోని మండాలపాడు గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రజారోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రణాళిక”లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు వివిధ ఆరోగ్య సమస్యలు, నివారణోపాయాలు, మరియు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా వక్తలు సీజనల్ వ్యాధులు, మాతాశిశు ఆరోగ్యం, పౌష్టికాహారం మరియు వ్యక్తిగత పరిశుభ్రత గురించి విస్తృతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాయం రమేష్ , పంచాయతీ సెక్రటరీ నాగేంద్ర బాబు , స్థానిక ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బారావు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *