రాష్ట్ర స్థాయి పోటీలలో మెడల్స్ సాధించిన ఉర్దూ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ను ఘనంగా సన్మానించారు

తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మన్సూర్ ఖాన్

పయనించే సూర్యుడు న్యూస్: కడప ఏప్రిల్:8 నెల్లూరు జిల్లా కావలి పట్టణం డిబిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన రాష్ట్ర స్థాయి జంప్ రోప్ గేమ్స్ లో ఉర్దూ స్కూల్ బుచ్చర్ స్టేట్ విద్యార్థిని విద్యార్థులు గోల్డ్ మెడల్ ,సిల్వర్ మెడల్స్ సాధించారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మన్సూర్ ఖాన్ అలీ విద్యార్థినీ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఈ క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించి మీ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని అలాగే తల్లిదండ్రుల పేరును టీచర్స్ ను గౌరవించాలి భక్తి శ్రద్ధలతో వెలగాలని చదువుతోపాటు మంచి క్రీడలు కూడా రాణించాలని తెలిపారు, నగర ఇంచార్జి వార్డు మెంబర్ రాఘవేంద్ర మాట్లాడుతూ స్కూలుకు మంచి పేరు తీసుకురావాలి ఆటల్లో ముందు ఉండి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి అబ్దుల్, పాఠశాల హెచ్ఎం సికిందర్ బేగం , సికిందర్ భాష, జమీల్ భాష, నాయబ్ రసూల్, నజీముల్లా, చాంద్ బాషా, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *