
పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 8 ,తల్లాడ రిపోర్టర్ ప్రజల కోసం పని చేసే నిజమైన ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో చూపిస్తోంది. ముద్దనూరు గ్రామ సర్పంచ్ యరమల రామ్మోహన్ రెడ్డి అన్నారు.
కేవలం మాటలు కాదు 99 రోజుల ప్రజా పాలన. ప్రగతి ప్రణాళికలో యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. ఇదే నిజమేనా ప్రజా పాలన. అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముద్దనూరు గ్రామ సర్పంచ్ యరమల రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా, వీధిలైట్లు సమస్య పరిష్కారం, శానిటేషన్ సమస్యలను ప్రజల నుండి తెలుసుకొని 2లక్షల రూపాయలతో నూతన రెండు బోర్లను రంగాపురం గ్రామాల్లో ఒకటి, స్మశాన వాటికలో మరొకటిని నూతనంగా ప్రారంభించారు. వార్డులలో అపరిష్కృతంగా ఎన్నో నెలల నుండి సైడ్ కాలాలను జెసిపి సాయంతో పరిశుభ్రపరిచారు. పిచ్చి మొక్కలను తొలగించి రోడ్లను క్లీన్ చేయించారు. నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు నూతన స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో తన తండ్రి సర్పంచ్ గా యరమల వెంకటేశ్వర రెడ్డి ప్రజాసేవకే ముందున్నారన్నారు. తన తండ్రి ఆశయ సాధనలో ముందుండి ప్రజా సంక్షేమాన్ని నెరవేర్చుటలో ముందు ఉంటానని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు శుభ్రత పరిశుభ్రత పాటించాలని, ఇంటి వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తడి చెత్త పొడి చెత్తను బండిలో వెయ్యాలని, ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి ప్రశాంత్, ఉప సర్పంచ్ కంభంపాటి పద్మ, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
