
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏప్రిల్ 8 జగ్గయ్యపేట బస్ స్టేషన్ వద్ద అమేసియా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గయ్యపేటఈ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ రాజు మాట్లాడుతూ, అమేసియా స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు. అలాగే స్థానిక యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం అమేసియా స్పోర్ట్స్ క్లబ్ డైరెక్టర్ మురారి భాస్కర్ మాట్లాడుతూ, జగ్గయ్యపేటలో తొలిసారిగా ఫ్రాంచైజ్ ఆధారిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ లీగ్ ద్వారా స్థానిక ప్రతిభకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, స్థానిక వ్యాపారవేత్తలు ఫ్రాంచైజ్‌లను స్వీకరించి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడడంతో పాటు క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమేసియా స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.