ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు 08-04-2026-రాజంపేట న్యూస్ : మంగళవారం నందలూరు మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నందలూరు బస్టాండ్ కూడలిలో ఉన్నటువంటి శ్రీరామ్ ప్రజా వైద్యశాల వద్ద సాయి లోకేష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సాయి లోకేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టతను వివరించి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీగా చెప్పుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. అలాగే నల్లదిమ్మయపల్లి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ యాదవ్, రాష్ట్ర మైనారిటీ మాజీ ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్, రాయలసీమ రీజినల్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు మొగరాజు రమణయ్య, జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు, జిల్లా బీజేవైఎం అధ్యక్షులు తోట శ్రీనివాస్ ధీరజ్, పెనగలూరు మండలాధ్యక్షులు రెడ్డి కృష్ణ రాయల్, ఒంటిమిట్ట మండలాధ్యక్షులు భాను ప్రకాష్ రాజు, అశోక్ రెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగుల బాలాంజనేయులు, గోర్ల శ్రీనివాసులు, రాజంపేట మండలం అధ్యక్షులు వి.వి రమణ, ప్రధాన కార్యదర్శి గిరీష్, ధనాసి నరసింహులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *