జగిత్యాల జిల్లా కేంద్రంలో డి హెచ్ పి ఎస్ వాల్పోస్టర్ ఆవిష్కరణ

పయనించే సూర్యుడు 8-4-2025 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా కేంద్రం లోనీ అంబేద్కర్ భవనం వద్ద డి హెచ్ పి ఎస్.వాల్ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం. జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీజేపీ పరిపాలన లో దళితులకు దేశావ్యాప్తంగా రక్షణ కరువైయింది రాజ్యాగ హక్కులు కాలరాయబడుతున్నాయి నిరంతరం దళితుల హక్కుల రక్షణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది దళిత మహిళలపై హత్యలు హత్యాచారాలు జరుగుతున్నాయి వారి రక్షణ కోసం అందరు ఐక్యంగా పోరాడాలి దళితులను రక్షించుటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యాయి అని అన్నారు పాలకులు రాజ్యాగ చట్టాలు దళితులకు వెతిరేకంగా అమలు చేస్తున్నారని అన్నారు దీని వల్ల పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శించారు సామాజిక న్యాయం సాధన వంటి ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్ అమలు వంటి అంశాలు చేర్చించేందుకు 17.18. తేదీలో వరంగల్ నగరంలో రాష్ట్ర రెండవ మహా సభలు నిర్వహిస్తున్నారని తెలిపారు సమాజం లో ఇంకా అంటరాని తనం కొనసాగుతున్నదని దళితుల సామాజిక ఆర్థిక రాజకీయ హక్కుల సాధనకు ఈ మహా సభలు దోహదా పడుతయని అని అన్నారు ఏప్రిల్ 17న జరిగే భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి దళితులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కారిక్రమంలో జిల్లా అధ్యక్షులు మునుగురి అనుమంతు. జిల్లా సహాయ కార్యదర్శి శనిగరపు ప్రవీణ్. జిల్లా కార్యవర్గ సభ్యులు అచ్చ ప్రవీణ్.బొమ్మేన పురుషోత్తం. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *