పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 ఆదోని రూరల్ రిపోర్టర్ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఆర్థిక భారం తగ్గించడానికి ఉచిత విద్యుత్ బిల్లును ప్రవేశపెట్టింది అందుకోసం ఆదోనిలో చేనేత కార్మికులు గ్రామసభ నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప హాజరవడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో మాట్లాడి కేంద్ర సహాయంతో రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికుల కష్టాలను చూసి వాళ్లకు ఆర్థికంగా సహాయపడాలని ఒక ఉద్దేశంతో 1 ఏప్రిల్ 2026 నుంచి చేనేత కార్మికులకు 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్* ప్రకటించడంతో చేనేత కార్మికులు ఆనందంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి పాలభిషేకంతో ధన్యవాదాలు* తెలిపినారు అంతేకాదు ఇక విజనరి నాయకుడు దూరాదృష్టితో ఎలా ఆలోచించి ప్రజలకు మంచి చేస్తున్నారు అదే బాటలో మన యువ నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఎంతో కష్టపడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు తోడుగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా గ్రామ అభివృద్ధిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాలను తీర్చి దిద్దుతున్నారు కాదు 2047 దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు.