6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలం

* రైతుల వైపు కన్నెత్తి కూడా చూడని కాంగ్రెస్ పార్టీ? * రైతన్నల కష్టం కాంగ్రెస్ పార్టీకి కనబడదా? * నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆదుకోవాలి * రైతన్నల కోసం సిపిఐఎం సిపిఎం పార్టీ నాయకులు ధర్నా వినతిపత్రం వితరణ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 8 బోధన్ : సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ చౌరస్తా నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేసి ఏవో కు వినతిపత్రం అందజేశారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని తెలంగాణ రాష్ట్రంలో అమలు కాని పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలవుతాయని కేరళలో అధికారం కోసం మేము కూడా మీకు 6 గారంటీల అమలు చేస్తామని అబద్ధ ప్రచారాలు చెబుతున్నారు సాలుర మండలంలో ఖాజాపూర్ హున్సా మందర్న వర్షాకాలం పంటలు నష్టపోయినా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకర విషయం అని ఆరుగానం పండించిన పంట ఒకేసారి వడగళ్ల వానతో రైతులు ఎంతో నష్టపోయినారని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆయా గ్రామా రైతన్నలకు ఎకరానికి 50 వేలకు పైగా ఇవ్వాలని సిపిఎం సిపిఐఎం పార్టీ డిమాండ్ చేశారు లేదంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు బోధన్ ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్ ఏరియా కమిటీ కార్యదర్శి ఎశాల గంగాధర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *