ఎన్ని కుట్రలు చేసినా ప్రజాసేవా కార్యక్రమాలు ఆపేప్రసక్తేలేదు: హోప్ చైర్మన్కొండ విజయ్కుమార్

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 8 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ తన పై పని గట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా తన ప్రజా సేవా కార్యక్రమాలు కొనసాగునే ఉంటాయని హోప్ ఫౌండేష న్ చైర్మన్ కొండ విజయ్కుమార్ అన్నా రు. మంగళవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల చౌరస్తా వద్ద ఏర్పా టు చేసిన చలివేంద్రంను ఆయన ముఖ్య అతిథిగా హాజరై హోప్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఆనంతరం వైహన దా రులకు,పాదచా రులకు మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ… అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తున్న తరుణంలో ప్రజలు అధిక మొత్తం లో మంచి నీళ్ళు తాగాలన్నారు.వేసవి లో మంచినీళ్ళు అందుబాటులో ఉండే లా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామ న్నా రు. తన సేవా కార్యక్రమాలను ప్రజల్లో తనకున్న ఖ్యాతిని చూసి జీర్ణించుకోని కొంత మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని. వారు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల్లోని తనకు మరిం తగా ఆధరణ పెరుగుతుంది.తమ కార్య క్రమాలు ఇలాగే కొనసాగుతాయని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్ర మాలు ఎక్కువగా చేపడతామని ఈ సంద ర్భంగా కొండ విజయ్ కుమార్ తెలిపారు. వేసవి తాపంలో బాటసారు దాహార్తిని తీర్చేందుకు చలివె ంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్. మల్లేష్, మారం ప్రసాద్. షర్ఫుద్దీన్లతో పాటు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *