జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు తక్షణమే ఇవ్వాలి : మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇరిగి గురునాథం

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 08. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా, మరియు చండూరు మున్సిపాలిటీ, చండూరు మండల పరిధిలో పనిచేస్తున్నట వంటి వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లును తక్షణమే ప్రభుత్వం మంజూరు చేయాలి అనీ చండూరు లోని స్థానిక విలేకరుల సమావేశంలో మాదిగ జేఏసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇరిగి గురునాథం డిమాండ్ చేశారు. జీతభత్యం లేని విధులు నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా అహర్నిశలు కృషీ చేస్తున్న విలేకరుల పాత్ర సమాజంలో ఎంతో ఈ సమాజంలో ఎంతో ఘననీయమైనదనీ కొనియాడారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా విలేకరులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇస్తాము అన్న మాట నీటి మీది మూట లాగా మారిందన్నారు. జర్నలిజంలోకి ఎంతో ప్రీతితో, ఫ్యాషన్ తో వచ్చిన వారు కొందరైతే, మరి సమాజంలో విలేకరిగా బాధ్యతగా పనిచేస్తున్న వారికి వారి వారి సంస్థల నుండి జీతభత్యాలు కూడా ఏమీ లేకపోగా కనీసం ప్రభుత్వం నుండి ఏదో ఒక రకమైన సహాయం అందుతుందన్న ఆశతో ఎంతోమంది విలేకరుల ఆశలు ఒంటె పెదవికి నక్క ఆశపెట్టుకున్న చందంగా మారిందన్నారు. ఎంతో మంది జర్నలిస్టులు కుటుంబాలను పనంగా పెట్టి జర్నలిస్టు వృత్తి లోపల కోన సాగుతున్నారని, అటువంటి జర్నలిస్టుల కు ప్రభుత్వం నుండి ఏ రకమైన చేయుత లేక వారి పరిస్థితి దయనీయంగా, దీనంగా మారిందనీ వారిని తక్షణమే ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని, కనీసం వారికి నిలువ నీడ కోసం జర్నలిస్టుల కుటుంబాలకు భరోసగా కనీస నివాసం కోసం ఇండ్ల స్థలాలు ఇండ్లును తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *