సిపిఎం నాయకురాలు విజయ మృతి తీరని లోటు

* భుజంగర్ రెడ్డి కుటుంబానికి పరామర్శ * మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

​పయనించే సూర్యడు ఏప్రిల్ 08 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు సైదయ్య సతీమణి, ఐద్వా నాయకురాలు కన్నెబోయిన విజయ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె మృతి వార్త తెలియగానే మండలంలోని పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు రత్నవరం చేరుకుని విజయ భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, లు మాట్లాడుతూ.. విజయ మరణం పార్టీకి మరియు మహిళా సంఘాలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ​నివాళులర్పించిన ప్రముఖులు: నివాళులర్పించిన వారిలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు నమ్మాది వెంకటేశ్వర్లు, గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, నాయకులు బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, ముత్యాలు, భద్రయ్య, రైతు సంఘం సీనియర్ నాయకులు ఏనుగుల వీరాంజనేయులు ఉన్నారు. అలాగే బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోలంపల్లి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు వీర బాబు, గ్రామ సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ విజయవర్ధన్ రెడ్డి, కాసాని శీను కూరాకుల కృష్ణమూర్తి కూరాకుల సతీష్ తదితరులు విజయకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ​భుజంగ్ రెడ్డి కుటుంబానికి పరామర్శ ​అదేవిధంగా, రత్నవరం గ్రామానికి చెందిన రామిని భుజంగ్ రెడ్డి ఇటీవల మృతి చెందగా, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వారి నివాసానికి వెళ్లి భుజంగ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాముని విజయ్ వర్ధన్ రెడ్డి తోకల ప్రభాకర్ రెడ్డి పలువురు గ్రామ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *