పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 9 ,తల్లాడ రిపోర్టర్ తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ కార్మికులకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని ఆర్డిజన్లుగా మారుస్తూ స్టాండింగ్ రూల్స్ రూపొందించడానికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న ఈనెల 8 నుండిసమ్మె చేస్తున్నారు, ఈసమ్మెకుట్రేడ్ యూనియన్ఆఫ్ఇండియా(టి యు సి ఐ) ఖమ్మంజిల్లాకమిటీ సంపూర్ణంగామద్దతు తెలియజేస్తున్నదనిటియుసిఐ ఖమ్మంజిల్లాసహాయకార్యదర్శి డి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల 23,000 మంది సమ్మెలో దిగుతున్నటువంటి స్థితి ఉన్నది వారి సమస్యలు పరిశీలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని వేసవికాలంలో విద్యుత్తు డిమాండ్ ఎక్కువగా ఉంటది ఇలాంటి సమయంలో విద్యుత్ కార్మికులు సమ్మెకు దిగడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రంగా నష్టకరమైనది వారు అన్నారు ,కార్మికుల సమస్యల పాట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారిని రెగ్యులర్ పనిచేస్తున్నటువంటి కార్మికులకు వర్తింపజేసే విధంగా రూల్స్ ను అమలు చేయాలని వారు ఏదైతే న్యాయమైన డిమాండ్స్ పైన సమ్మె నిర్వహిస్తున్నారు కార్మికుల డిమాండ్ పరిష్కరించాలని లేనియెడల ఇతర రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని కూడా రోడ్లమీద తీసుకొచ్చి వారికి సంఘీభావంగా పోరాటాల నిర్వహిస్తామని వారన్నారు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పాలకవర్గాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆ విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల ఐక్య పోరాటాలు నిర్వహించినప్పుడు మాత్రమే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని వారు తెలిపారు.