పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 9 ,తల్లాడ రిపోర్టర్ మండల కేంద్రమైన తల్లాడలో బుధవారం మధ్యాహ్నం పట్టపగలు చోరీ జరిగింది. తల్లాడలోని గొల్లగూడెంకు వెళ్లే దారిలో షేక్ జమాల్ స్వగృహంలో దొంగలు చోరీ చేసినట్లు గుర్తించారు. వివిధ పనుల నిమిత్తం ఇంట్లో తాళం వేసి వెళ్లిన జమాల్ తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లాడ ఎస్సై 2 వెంకటేష్ సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొన్ని బంగారపు వస్తువులతో పాటు 30 వేల నగదు దొంగిలించినట్లు బాధితుడు జమాల్ తెలిపారు. బంగారపు వస్తువుల విలువ సుమారు 7 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు.