పయనించే సూర్యుడు డిసెంబర్ 28 నేరేడుచర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమం గుణ పాఠాలు కర్తవ్యాల సదస్సు ను విజయవంతం చేయాలని ఈరోజు నేరేడుచర్ల మిర్యాలగూడ రోడ్డు సిపి ఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో హైదరాబాదుకు బయలుదేరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ హుజూర్నగర్ డివిజన్ కార్యదర్శి వాసపల్లయ్య ఇట్టి సదస్సును విజయవంతం చేయాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ హుజూర్నగర్ డివిజన్ సభ్యులువాసకరుణాకర్, షేక్ రజాక్, సైదులు వీడియోస్ జిల్లా నాయకులు మాతాంగి విజయ్ పిఓడబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యురాలు చందనబోయిన లక్ష్మి, సయ్యద్ రేష్మ,శ్యామల , మరియమ్మ మల్లేశ్వరి మరియు ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం నుండి బైరం ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.