పయనించే సూర్యుడు బోయిన్ పల్లి డిసెంబర్ 30 2025(మధులత రాగేటి) గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి, నిధుల కోసం ఎదురుచూస్తున్న తాజా మాజీ సర్పంచులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని ‘తాజా మాజీ సర్పంచుల జేఏసీ (JAC)’ తీవ్రంగా ఖండించింది. పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో, రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులను పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడంపై జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపెల్లి కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, సర్పంచులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడం ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు. 2019-24 కాలంలో సర్పంచులు తమ సొంత నిధు