పయనించే సూర్యుడు మార్చి 13 సంగారెడ్డి జిల్లా కంగ్టి సంగారెడ్డి జిల్లా కేంద్రంతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ (మార్చి 6 నుంచి జూన్ 12 వరకు) అవగాహన సదస్సు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగించింది ఈ కార్యక్రమంలో *తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయం తదితర శాఖల్లో 10 ప్రత్యేక థీమ్‌లతో ప్రజల సమస్యలను పరిష్కరించే ఈ కార్యాచరణ జిల్లా ఎక్కడా ప్రజలకు మేలు చేకూర్చనుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు అధికారులకు ప్రజాప్రతినిధులు సూచించారు అనంతరం ఎమ్మెల్యే నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ) అవగాహన సదస్సు విచ్చేసిన ఖేడ్ మున్సిపల్ కౌన్సిలర్లు,మరియు సర్పంచ్‌లు ఎమ్మెల్యే ని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు,సర్పంచ్‌లు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు