​ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్.

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 22 మామిడిపెల్లి లక్ష్మణ్ పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని, స్థానిక ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనల అనంతరం వారిని ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. ​ఈ కార్యక్రమంలో చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. “రంజాన్ పండుగ క్రమశిక్షణకు, దాతృత్వానికి సోదరభావానికి ప్రతీక అని, మనమందరం కలిసిమెలిసి ఉండటమే మన సమాజ గొప్పతనమని” పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కౌన్సిల్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ​ఈ వేడుకల్లో స్థానిక ముస్లిం పెద్దలు, యువకులు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *