వెన్నంపల్లి ముస్లింలకు ‘ఈద్ కా తోఫా’ పంపిణీ.

పయనించే సూర్యుడు మార్చ్ 19 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వెన్నంపల్లి గ్రామంలో బుధవారం ముస్లింలకు ‘ఈద్ కా తోఫా’ కానుకలను మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి, మాజీ ఎంపిటిసి పరకాల రమేష్, వార్డు సభ్యులు సారబుడ్ల లింగారెడ్డి, కొంపల్లి ప్రశాంత్ రెడ్డి, మొలుగురి వనిత- రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి సుధాకర్ రెడ్డి, పేరాల ప్రభాకర్ రావు, తాడిచర్ల కుమార్, బిస నరసయ్య, రేగుల బిక్షపతి,బండ శివానందరెడ్డి, కొంపెల్లి అనిల్ రెడ్డి, మారుపాక సుమన్, సంగాల మహేష్, ముస్లిం సోదరులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *