ఘనంగా ప్రారంభమైన ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు: రాజాపూర్ సర్పంచ్ కావలి రామకృష్ణ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10,మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్:. రాజాపూర్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కావలి రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంసద్ ఖేల్ మహోత్సవం ఒక అద్భుతమైన వేదిక అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమూరు కార్పొరేటర్ పాండురంగ రెడ్డి, మండల అధ్యక్షులు కాటేపాగ ఆనంద్, జిల్లా సీనియర్ నాయకులు పల్లె శేఖర్ అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ,యువత క్రీడల్లో రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, జనరల్ సెక్రెటరీ గంగాధర్ గౌడ్, నాయకులు మధు, అరుణ్ రెడ్డి, బాలగౌడ్, శేఖర్ గౌడ్, రాజపూర్ మండల ఉప సర్పంచ్ నజీమ్, అనిల్, ఉదయ్ గౌడ్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు రవికుమార్, నెల్లి నరసింహ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *