పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో శ్రీ అలెర్మెల్ మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం నాడు మహిళల భక్తుల ఆధ్వర్యంలో శ్రీ లలిత సహస్రనామాలు మరియు శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం నాడు 20 మంది మహిళలచే ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు రాజేశ్వరి,సూర్య కళ లు తెలిపారు. అనంతరం సామూహికంగా కుంకుమార్చన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పద్మ,చంద్రకళ ప్రసన్న,రజిత,శోభ కృష్ణమ్మ,కవిత,రాధా శ్రీదేవి,జ్యోతి,లక్ష్మి,పద్మ తదితరులు పాల్గొన్నారు.