గోశాల నిర్వహణకు రూ 30వేలు విరాళం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 11.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె నాగరాజ) శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోశాల నిర్వహణకు చౌడేపల్లి కి చెందిన దాత రూ 30 వేలను విరాళంగా అందించారు చౌడేపల్లి పట్టణం మోటారు వీధికి చెందిన శ్రీనివాసులు గోశాల కోసం నగదును ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరంకు అందించారు ఈ సందర్భంగా దాతలను సాదరంగా ఆహ్వానించి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు ఆలయ అధికార సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *