నాయి బ్రాహ్మణ ఆడహక్ కమిటీ నియామకం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : మంగళవారం రోజున శంకరపట్నం మండల నాయీబ్రాహ్మణ సేవాసంఘం జిల్లా అధ్యక్షులు నీలం మొండయ్య నాయీ ,జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల సంపత్ నాయీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఇట్టి సమావేశానికి జిల్లా గౌరవ అధ్యక్షులు ఔదుర్తి లక్ష్మణ్ కుమార్ నాయీ,జిల్లా ఉపాధ్యక్షులు జంపాలభిక్షపతి నాయీ పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో శంకరపట్నం నాయీబ్రాహ్మణ మండల ఎన్నికల కొరకు సభ్యత్వాలు తీసుకోవాల్సిందిగా సభ్యత్వాల కొరకు 5 సభ్యులను తీసుకోవడం జరిగింది.తిప్పబత్తిని నారాయణ నాయీ తిప్పబత్తిని కుమారస్వామి నాయీ దుబ్బాక నర్సయ్య నాయీ సూత్రపు సంపత్ నాయీ జంపాల సమ్మయ్య నాయీ నీ ఐదుగురితో కమిటీ వేయడం జరిగినది. మండలంలోని ప్రతి గ్రామాలు తిరుగుతూ సంఘియుల దగ్గర సభ్యత్వం చేయించాలి. సభ్యత్వం చేసిన తరువాత మండలం ఎన్నికలు జరుపుతామని జిల్లా నాయకులు ప్రకటించారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *