ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ పై మరియు కామన్ సైట్లపై పంచాయతీ కార్యదర్శి పై విచారణ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ రమణయ్యపేట గ్రామపంచాయతీలో జరుగుతున్న కామన్ సైట్ ల పై ఇటీవల మాజీ వార్డు సభ్యులు కుడిపూడి బాలాజీ ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి ఇన్చార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రమణయ్యపేట గ్రామపంచాయతీలో కామన్ సైట్లు పై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంక్వయిరీ నిర్వహించారు. ఫిర్యాదుదారుడు కుడుపూడి వెంకట బాలాజీ తో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం ఇంచార్జ్ డిపిఓ లక్ష్మణరావు అన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ వార్డు సభ్యులు కుడుపుడి వెంకట బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో ఎంక్వయిరీ చేసే నిమిత్తం రావడం జరిగిందని తెలిపారు. మరో 20 రోజులు తర్వాత ఫీల్డ్ కి వచ్చి ఎంక్వయిరీ చేయడం జరుగుతుందని అనంతరం రిపోర్టును కలెక్టర్కు అందజేయడం జరుగుతుందన్నారు. బాలాజీ మాట్లాడుతూ ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ మరియు కామన్ సైట్లు అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఉద్దేశంతో ఫిర్యాదు చేయడం జరిగిందని గ్రామపంచాయతీ అధికారి పాండురంగారావు కామన్ సైట్లకు జరిగిందని దీనిపై ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. నిజ నిర్ధారణ అయితే వెంటనే సంబంధం అధికారిపై పై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీనిపై 2011 వ సంవత్సరంలో నుండి పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ అన్నామని, ఎండిఓ సతీష్ , ఇ ఓపిఆర్డి శ్రీరామ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *