వి.ఆర్.పురం మండలంలో ఏజెన్సీ చట్టాలను తుంగలోకి తొక్కుతున్న రెవెన్యూ, పంచాయతీ అధికారులు.

ఆదివాసి సంక్షేమ పరిషత్ తీవ్ర మండిపాటు.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.10.2026 గురువారం నాడు”ఆదివాసి సంక్షేమ పరిషత్”(274/16)ఆధ్వర్యంలో వి.ఆర్.పురం మండలం రేఖపల్లి లో ఏర్పాటు. చేసిన సమావేశంలో “ఆదివాసి సంక్షేమ పరిషత్”రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ… వి.ఆర్.పురం మండలంలో భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన ప్రత్యేక ఐదవ షెడ్యూల్ చట్టాలు అమలకు నోచుకోవటం లేదని. ఆయన ఆవేదన వ్యక్తపరిచారు, మండల కేంద్రంలో నాన్ ట్రైబల్ విచ్చలవిడిగా ఆర్.అండ్.బి స్థలాలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి వ్యాపార దుకాణాలు వేసుకుంటే అటువంటి అక్రమ, చట్ట విరుద్ధ వ్యాపార సముదాయాలకు పంచాయతీ డిపార్ట్మెంట్ వారు ఇంటి పన్నులు ఇవ్వడం, పంచాయతీ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కరెంటు మీటర్లకు ఎన్ఓసీలు జారీ చేయడం. చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో వి.ఆర్.పురం మండల పరిధిలో అక్రమ కట్టడాలు తొలగించాలని, ఇప్పటివరకు ఎన్ని అక్రమ కట్టడాలు గుర్తించి ఉన్నారు. సమాచారం ఇవ్వాలని ఆర్.టి.ఐ చట్టం ప్రకారం ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అక్రమ కట్టడాలు జాబితా ఇవ్వకుండా ఎమ్మార్వో కార్యాలయం నుండి నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలకు అండగా ఉంటూ నేటికీ సమాచారం ఇవ్వలేదని. ఉద్దేశపూర్వకంగానే వి.ఆర్.పురం తాసిల్దార్ కార్యాలయం నుండి అక్రమ కట్టడాల నాన్ ట్రైబల్స్ జాబితా బయటికి ఇవ్వటం. లేదని ఆపిల్ చేసిన కూడా చింతూరు సబ్ కలెక్టర్ ఆ సమాచారాన్ని ఇప్పించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. చింతూరు సబ్ కలెక్టర్ మరియు వి.ఆర్.పురం తాసిల్దార్ మరియు డిప్యూటీ తాసిల్దార్ పై రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కి ఫిర్యాదు. చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. రేఖపల్లి, మరియు వి.ఆర్. పురం కేంద్రంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న అక్రమ వ్యాపార సముదాయాలను నాన్ ట్రైబల్స్ నివాస గృహాలను తక్షణమే తొలగించాలని.1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, చట్టాన్ని నీరుగారుస్తున్న వి.ఆర్.పురం రెవిన్యూ మరియు పంచాయతీ అధికారులపై అధికార దుర్వినియోగం కేసులు నమోదు చేయాలని. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఉన్నత అధికారులను,ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు కూర చిట్టి బాబు సోడే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.కుంజ శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *