గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్,డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు.

వివరాలు వెల్లడించిన డిఎస్పీ నాగేంద్రచారి

పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా (స్టాఫ్ రిపోర్టర్ ఎమ్.ఎ.షకీల్) ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్ కి చెందిన సద్దాం 32, పాత బస్టాండ్ కి చెందిన ఎంబేరి ఆకాష్ 26 age,రాజీవ్ నగర్ చెందిన మరో బాలుడు ముగ్గురు కలసి గంజాయి కి తాగడానికి అలవాటు పడి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన గుర్తుతెలియని వ్యక్తుల నుండి గంజాయిని తీసుకువచ్చి సిరిసిల్ల పట్టణ పరిధిలోని K-కన్వెన్షన్ హాల్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు నిన్నటి రోజున సాయంత్రం సమయంలో తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారికి గంజాయి కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ కాగా వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా తాము గంజాయి అలవాటు నుండి బయటపడాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, చికిత్స పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుపగా NDPS యాక్ట్ ప్రకారం గౌరవనీయ న్యాయస్థానం అనుమతితో వారిని సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపడం జరిగిందని డిఎస్పీ తెలిపారు. గంజాయి సంబంధిత సమాచారం లేదా గంజాయి అలవాటుకు బానిసై మానలేని స్థితిలో ఉన్న వ్యక్తుల వివరాలు తెలిసిన పక్షంలో సమీప పోలీసులకు సమాచారం అందించండి.అట్టి వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించి, అవసరమైతే డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించి పునరావాసం కల్పించడం జరుగుతుందన్నారు. డిఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్.ఐ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *