చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా కంచర్ల భాస్కరరావు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా కంచర్ల భాస్కరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష ఎన్నిక జరిగిన నేపధ్యంలో పట్టణంలోని చంద్రమోటర్స్(హీరో షోరూమ్) యజమాని కంచర్ల భాస్కరరావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా ఏకగ్రీవంగా ఎన్నికైన భాస్కరరావుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *