పయనించే సూర్యుడు మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి ఏప్రిల్ 11 కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రం పరిధిలో చుక్కాపూర్ గ్రామం లో మంచినీరు సమస్య పరిష్కారం లో ఫిర్యాదు చేసిన బీజేపీ పార్టీ మండల కార్యదర్శి మాచారెడ్డిమండలం , పంచాయతీ చుక్కాపూర్ గ్రామంలో జలజీవన్ మిషిన్ ద్వారా వేసిన బోరు పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉండడం వలన మా గ్రామంలో మంచినీరు సమస్య తీవ్రంగా ఏర్పడుతుందని మహిళలు చేరుకొని ఫిర్యాదు చేయడం జరిగింది. మండల స్థాయి అధికారులు ద్వారా సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా సంబంధికారులకు కలిసి సమస్య పరిష్కారం చేయాలని విన్నవించారు. తమ పనులు మానేసి పాడేరు చేరుకోవడం జరిగింది. చుక్కాపూర్ మహిళలు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ మాకు ఉన్నా మంచినీరు సమస్య సత్వరమే పరిష్కారం చేయకపోతే నిరసన కార్యక్రమానికి బిందెలు తో సిద్ధమవుతామని అన్నారు. వేసవికాలం కావడంతో నీటి ఎద్దడి తీవ్రంగా ఎదుర్కొంటున్నమని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక దఫాలుగా మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని వినతులు ఇస్తున్న నామమత్రంగా సమస్య పరిష్కారానికి సహకరిస్తున్నట్టు అధికారులు పని ఉంది కానీ శాశ్వతంగా మంచినీళ్లు సమస్య పరిష్కారం చేయాలని చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ గ్రామ అధ్యక్షులు హోబిల్ రెడ్డి,పంచాయతీ తదితరులు పాల్గొన్నారు.