ఆదోని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాత్మ పూలే జయంతి వేడుకలు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. మంద కృష్ణ మాదిగ నాయకత్వం బలపరుస్తూ మానవతావాది మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఎమ్మార్పీఎస్ టౌన్ కన్వీనర్ వన్నెల మణికంఠ మాదిగ, కో కన్వీనర్ జిఎస్ దత్తు మాదిగ అధ్యక్షతన స్థానిక ఆదోని మున్సిపల్ ఆవరణ నందు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బాలన్న మాదిగ, జిల్లా కార్యదర్శి పిఎస్ వీరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బండారి గిడ్డయ్య మాదిగ, పాల్గొని వారు మాట్లాడుతూ, తరతరాలుగా దేశంలో కొనసాగుతున్న బ్రాహ్మణాధిపత్యం పై మొట్ట మొదట తిరుగుబాటు చేసిన ధీరోదాత్తుడు దేశంలో వ్యవస్థీ కృతమైన కుల వ్యవస్థ పై గర్జించిన తొలి కేసరి మహాత్మ జ్యోతి రావు పూలే, ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ,మహిళల జీవితాల్లో విద్య జ్యోతిని వెలిగించి విద్యను అందించిన విద్యా ప్రదాత గులాంగిరి వంటి రచనల ద్వార సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలను జాగృతం చేసిన రుషి సత్య శోధక్ సమాజ్ అను సంస్థను స్థాపించి సమాజంలో సత్యాన్ని ప్రజలకు తెలిపిన సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే, అ మహానీయుని జన్మదినన్నీ ఘనంగా జరుపుకొని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో, ఎమ్మార్పీఎస్ పట్టణ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు ఎం జగన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సద్దాం ఊసేనప్ప మాదిగ, ఎం శాంతరాజు మాదిగ, మదిరి హరి మాదిగ, ఎమ్మార్పీఎస్ తిరుపతి చంద్రగిరి మండల అధ్యక్షులు గుమ్మల ప్రభాకర్ మాదిగ, మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *