ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు

కావడిగుండ్లలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ బాడిశ లక్ష్మణరావు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 13 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటమండల వ్యాప్తంగా పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచు కుని, ప్రజల దాహార్తిని తీర్చేందుకు అశ్వారావుపేట మండలం కావడి గుండ్ల గ్రామ పంచాయతీ ఆధ్వ ర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కావడిగుండ్ల సెంటర్లో సర్పంచ్ బాడిశ లక్ష్మణ రావు ఈ చలివేంద్రాన్ని ప్రారంభిం చి, ప్రజలకు మంచినీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూవి వేసవి తాపం దృష్ట్యా ప్రజలు, ప్రయాణికులు ఇబ్బం ది పడకుండా నిత్యం మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తె లిపారు. ప్రతి ఒక్కరూ ఈ సదుపా యాన్ని వినియోగించుకోవాలని కో రారు. వేసవిలో వడదెబ్బ తగల కుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని ఈసందర్భంగా ఆయ న సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కణితి జగ్గయ్య, మ డకం రాజులు, కంగాల గంగరాజు తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *