పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 14 మామిడిపెల్లి లక్ష్మణ్ మహాత్మ జ్యోతిరావ్ బాపూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఆవరణలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాయికల్ శాఖ నిర్వహిస్తున్న మండలస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో టి ఆర్ బి జట్టు ప్రధమ స్థానంలో , ద్వితీయ స్థానంలో తాట్లవాయి గ్రామజట్టు నిలిచాయని ఫిజికల్ డైరెక్టర్ పుర్రె రమేష్ తెలిపారు. విజేతలకు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 14న రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహుమతులు అందజేయనున్నట్లు ఆయన వివరించారు క్రీడల సక్రమనిర్వహణ కు వ్యాయామ ఉపాధ్యాయులు బందెల శ్రీనివాస్,సి.హెచ్ ప్రతాప్,ఆకు రాజేందర్ అనంతుల శ్రీకాంత్, సహకరించారని ఆయన అన్నారు . గెలుపు సాధించిన క్రీడాకారులకు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు నాయకులు ఉపాధ్యాయులు మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ కౌన్సిలర్ పుర్రె శ్రీధర్ తదితరులు అభినందనలు తెలిపారు.