ఘనంగా డా. బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

వేడుకలలో పాల్గొన్న సీఐ ఎం.అబ్బయ్య.

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 15, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు కంత్రి సత్తయ్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా నర్మెట్ట సీఐ అబ్బయ్య పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సీఐ అబ్బయ్య మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో సమానత్వం కోసం ఆయన పడిన తపన అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని రోడ్డు భద్రత సూచనలు పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు మల్యాల బాల నరసయ్య, పైసా రాజశేఖర్, అల్వాలరాజు, అల్వాల రమేష్, గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు, ఉప సర్పంచ్ బైరి రజిత వెంకటయ్య, పాలకవర్గ సభ్యులు,ఎమ్మార్పీఎస్ నాయకులు,మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకులు వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *