జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి: అంగన్వాడి కేంద్రంలో అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలోని గడివి అంగన్వాడి కేంద్రంలో జంక్ ఫుడ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సిబ్బంది మాట్లాడుతూ “జంక్ ఫుడ్ వద్దు – ఆరోగ్యం ముద్దు” అనే నినాదంతో పిల్లలు, తల్లిదండ్రులకు చైతన్యం కల్పించారు. చిరుధాన్యాలు మరియు పౌష్టికాహారం తీసుకోవడం పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి, పోషకాహారం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ చంద్రకళ, ఆయా నాగమణి, పిల్లల తల్లిదండ్రులు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *