పయనించే సూర్యుడు ,ఏప్రిల్ 15, భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో భారతరత్న, భీంరావ్ రాంజీ అంబేద్కర్ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారీ జన్మదినం సందర్భంగా పైనంపల్లి,చెరువుమాదారం , భైరవునిపల్లి, నేలకొండపల్లి గ్రామాల్లో వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది, ఈ సందర్భంగా పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ
ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని అన్నారు,అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి చేశారనీ, న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారని ,మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశారనీ,భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారని అన్నారు, యువత ప్రతీ ఒక్కరూ బాబా సాహెబ్ గారినీ అడుగు జాడల్లో నడవవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు మల్లెబోయిన గోవిందరావు, బాజా రామక్రిష్ణ, మండల నాయకులు సూరేపల్లి జ్ఞానరత్నం, సయ్యద్ మోహినుద్దీన్, కందరబోయిన గోపి, పుట్టా సత్యనారాయణ,కొడమగుండ్ల స్వామిదాస్, తంగెళ్ళ సతీష్, గెల్లా చక్రపాణి, పిట్టల సూరిబాబు, మూడు రమేష్, కారంగుల వీరయ్య తదితరులు పాల్గొనడం జరిగింది