
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 సాలూర : సాలుర మండల కేంద్రంలో మంగళవారం సాలూర ఖాజాపూర్ హున్సా మందర్న జాడి సాలంపాడ్ కుమ్మన్ పల్లి గ్రామాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ షీలా శంకర్ మండల గ్రామ సర్పంచులు పార్టీ నాయకులు అధికారులు ప్రజా ప్రతినిధులు దళిత సోదరులు తదితరులు పాల్గొన్నారు