
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 15 పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పొన్నం బాలాజీ ఈ సందర్భంగా పొన్నం బాలాజీ మాట్లాడుతూ ఆ మహనీయుని స్మరించుకోవటం ఎంతో గర్వంగా ఉందంటూ మన దేశంలో ఉన్న పేదవారందరికీ బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయాన్ని సమకూర్చిన ఆ మహానుభావుడు అంబేద్కర్ అంటూ కొనియాడారు. స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన పి అనిల్ మాట్లాడుతూ ఉన్నత వర్గాలకు కాకుండా మనుషులందరికి సమానమే అంటూ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇలా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం ఎంతో ఆనందకరమని అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపాధి హామీ శ్రామికులతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ కొనియాడారు. పొందూరు నాగేశ్వరావు అంబేద్కర్ 135 జయంతి అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. మహానుభావుడు ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమం తదనంతరం గుమ్మడిదూరు సచివాలయంలో గ్రామసభ నిర్వహించి ఆ మహనీయుడు అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించరు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కంచెటి రాంబాబు , మండెపూడి రామ్మోహన్ రావు సామినేని రాంబాబు ఆర్దల రమేష్ బాబు మునగా రామకృష్ణారావు ఆలూరు శ్రీనివాసరావు ముక్కు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
