ఎంజీఎన్ఆర్ ఇ జి ఎస్ గ్రామసభలో పాత పద్ధతిలో కొనసాగించాలని ఏజెన్సీ లో ముఖహాజరు రద్దు చేయాలని గ్రామసభ ప్రత్యేక నిర్వహించారు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ తేదీ 16 రూలర్ రిపోర్టర్ అల్లూరి సీతారామ జిల్లా అరకులోయ డివిజన్ మండల కేంద్ర పరిధిలో సుంకరమెట్ట పంచాయతీ పెద్ద గొంగడిగ్రామసభలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు ఎం జి ఎన్ ఆర్ ఇ జి ఎస్ గ్రామసభ లో పాతపద్దతిలో కొనసాగించాలి. ఏజెన్సీ లో ముఖహజరు రద్దు చేయాలని గ్రామసభ ప్రత్యేక అధికారి సెక్రెటరీ శివప్రసాద్ వారికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు గ్రామ పంచాయతీ సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు ఉపాధి కూలీలు కలిసి మోమోరండం ఇవ్వడం జరిగింది. అరకు వేలి మండలం సుంకరమెట్ట పంచాయతీ పెదగంగుడి గ్రామసభ లో ఉపాధి హామీ కూలిలు పాల్గోన్నారు. ఈ గ్రమసభలో పాల్గొన్న ఉపాధి కూలిలు ప్రస్తుతం ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పు చేసి గిరిజన ప్రాంతంలో ముఖ హాజరు రెండుపూటలు పని రెండు పూటల హాజరు గ్రూప్ ఫోటోలు అప్లోడ్ చేయాలని నిబంధనలు పెట్టడం వలన గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలు వలన కూలీలకు సకాలంలో హాజరు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఉపాధి హామీ కూలీలు గ్రామసభ ప్రత్యేక అధికారి వారికి తెలియజేశారు. అలాగే పనిముట్లు పంపిణీ చేయాలని ప్రతి గ్రామానికి కూలీలకు సరిపడ్డ ఐడి లు పంచాయతీ పరిధిలో ఇవ్వాలని అన్నారు. కేంద్రం 90% నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అందరికి కూలీ డబ్బులు వెంటనే చెల్లించాలని అన్నారు.పని ప్రదేశంలో కూలీలకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు మేట్ లకు జీతలు ఇవ్వాలని అన్నారు. రోజు కూలి 600/- రూపాయలు చెల్లించాలన్నారు. మేట్ లకు మొబైల్ రీఛార్జ్ ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలో పాల్గొన్న కూలీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ముఖాజరు రద్దు చేయాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇతర ప్రాంతంలో ఉన్న సౌకర్యాలకు తేడా ఉంది. గిరిజన ప్రాంతంలో సిగ్నల్ అందుబాటులో ఉండదు ఒకే దగ్గర పని ఉండదు వేరే ప్రాంతంలో పనులు ఉండడం వలన ఈ ముఖాహాజరు సమస్య తీవ్రంగా ఎదుర్కొంటున్నమని అన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని గ్రామ సభలో పాల్గొన్న ఉపాధి కూలీలు డిమాండ్ చేశారు. గ్రామసభ ప్రత్యేక అధికారి స్పందిస్తూ మీకు రావలసిన బకాయి డబ్బులు ఏప్రిల్ చివరి కల్లా ప్రతి ఒక్కరికి అకౌంట్లో డబ్బులు వస్తాయని అన్నారు. మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *