పెట్రోల్ బాంక్ వాళ్ళు ఆక్రమించిన నా స్థలము నాకు ఇప్పించండి

పెసా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిసిన బాధితుడు

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 16 పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామానికి చెందిన సవలం. బాబురావు తండ్రి ముత్తయ్య అనువారికి చెందిన భూమి సర్వే నెంబరు 167 /3ఇ విస్తీర్ణం 0.60 సెంట్లు భూమి ఉండగా అందులో 0.02 సెంట్లు చట్టీలో ఉన్న పెట్రోల్ బంక్ యజమాన్యం ప్రహరీ గోడ రీ మోడలింగ్ చేసే క్రమంలో వారి అదినంలో ఉన్నట్టుగా గ్రహించిన సంబంధిత భూ యజమాని అడ్డుపడి ఈ ప్రహరీ గోడ నాకు సంబంధించిన స్థలము నుండి కడుతున్నారు ఇది ఎలా సాధ్యం రెండు రోజులు ఆపండి సర్వే చేసిన తర్వాత సరిహద్దులు తెలుసుకొని కట్టుకొండి అని చెప్పగా భూ యజమాని మాటని సైతం లెక్క చేయక ప్రహరీ గోడ పూర్తి చేసి ఉన్నారు. ఈ క్రమంలో సంబంధిత భూ యజమాని చింతూరు ఐటిడిఏ గ్రీవెన్స్ లో తమ భూమిని సర్వే చేసి ఇవ్వగలరని కోరగా స్థానిక రెవెన్యూ సిబ్బంది సర్వే చేయగా సవలం బాబురావు తండ్రి ముత్తయ్య సంబంధించిన 0.60 సెంట్లు భూమిలో 0.02 సెంట్లు పెట్రోలు బంకు యాజమాన్యం అదినంలో ఉన్నట్టుగా అధికారికంగా తెలియజేసియు న్నారు. దాని ఆధారంగా చింతూరులో కలెక్టర్ ఆధీనంలో జరిగిన స్పెషల్ గ్రీవెన్స్ లో సంబంధిత బాధితుడు చట్టి గ్రామ పెసా కమిటీ వారి సహకారంతో కలెక్టర్ ని కలిసి పెట్రోల్ బంకు అదినం లో ఉన్నటువంటి రెండు సెంట్లు స్థలాన్ని అధికారికంగా ఇప్పించగలరని వినతిపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారు ఈ విషయంపై స్పందించి స్థానిక ఎమ్మార్వోకి పరిష్కారా బాధ్యతని అప్పజెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెసా కమిటీ ఉపాధ్యక్షులు తుర్రం.చిన్న ముత్తయ్య కార్యదర్శి పోడియం. రామకృష్ణ బాధితుడు సవలం. బాబురావు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *