యువత రాజకీయాలలో రాణించాలి : కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .

* యువతకు కో-ఆప్షన్ పదవులు , వరుస అవకాశాలు కల్పిస్తున్న ఎమ్మెల్యే . *యువకులు సమాజ సేవలో భాగస్వాములు కావాలి . *కో-ఆప్షన్ మెంబర్లుగా సామాన్య నిరుపేద యువత . *యువత పట్ల రాజ్ గోపాల్ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 16 : యువతకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. కో-ఆప్షన్ మెంబర్లుగా సామాన్య నిరుపేద యువతకు వరుస అవకాశాలు ఇవ్వడం , యువత పట్ల రాజన్న నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకుంటున్నారు. చండూర్ నుంచి చౌటుప్పల్ వరకు సామాన్య కుటుంబాల్లో పుట్టిన యువకులకు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు వరుసగా అవకాశాలు కల్పిస్తూ ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి యువత పట్ల తన ప్రత్యేక దృష్టిని మరోసారి స్పష్టంగా చాటిచెప్పారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు గోశిక వినయ్‌కు కౌన్సిలర్ బీఫారం ఇచ్చి అన్ని తానై గెలిపించి అదే యువకుడిని మునిసిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎదిగేలా అవకాశం కల్పించడం రాజన్న నాయకత్వ దూరదృష్టికి నిదర్శనం. అలాగే చండూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యంత నిరుపేద వర్గానికి చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్త బుషిపాక వాసుకి బీఫారం ఇచ్చి కౌన్సిలర్‌గా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గెలిపించారు. తరువాత అదే దిశగా మరో అడుగు ముందుకు వేసి, నేడు యువజన కాంగ్రెస్ కార్యకర్త ఎస్ కే . ఖలీల్‌కు కో-ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించడం విశేషం. ఈ ముగ్గురు యువకుల ప్రయాణం ఒకటే నిరుపేద నేపథ్యం , ఆర్థిక బలం లేకపోవడం , కష్టపడి ఎదగాలనే తపన , నాయకుడిపై అచంచల విశ్వాసం . ఇలాంటి యువతను గుర్తించి, వారికి ఇలాంటి అవకాశాలు కల్పించడం పట్ల సమాజ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *