పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి -16 సింగరేణి సంస్థలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని సింగరేణి అధికారులు గుర్తుపెట్టుకోవాలని బిజెపి సీనియర్ నాయకులు మొలుమూరి శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సింగరేణి సంస్థలో 40 వేల మంది పర్మినెంట్ కార్మికుల కుటుంబాలు 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నారన్నారు. ప్రస్తుతం కొందరు అధికారులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ సంస్థను అవినీతి కేంద్రంగా మార్చుతున్నారని శ్రీనివాస్ తీవ్రంగా ఆరోపించారు.సింగరేణిలో టెండర్లు, ఓబి కంపెనీలు ప్రైవేట్ కంపెనీలో ,యంత్రాల కొనుగోలు, స్పేర్ పార్ట్స్, కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీ అవినీతి జరుగుతోందని, కొందరు అధికారులు మరియు కాంట్రాక్టర్లు కుమ్మక్కై సంస్థను నష్టాల్లోకి నెట్టే విధంగా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై మేము మౌనం వహించముఅని ఆయన స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని అవసరమైతే విజిలెన్స్, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తామని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించడానికీ వెనుకాడమని అవినీతి అధికారులను బహిర్గతం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.సింగరేణిని కొందరి స్వార్థ రాజకీయాలకు బలి చేయనివ్వము కార్మికుల భవిష్యత్తు, సంస్థ గౌరవం కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుంది అని హెచ్చరించారు.