గిరివికాసం బోర్ల తవ్వకానికి అటవీ శాఖ ఆటంకాలు తొలగించాలని వినతి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10-04-26 కొమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్ జై నూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్ధన్ వార్తా విశ్లేషణ :​జైనూర్ : గిరిజన ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘గిరివికాసం’ పథకం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ స్థానిక రైతులు మరియు నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కలిసి వినతి పత్రం సమర్పించారు. రైతులు తమ భూముల్లో గిరివికాసం పథకం కింద బోర్ వేల్స్ వేయించుకోవాలని ప్రయత్నిస్తుండగా, అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఆటంకాలు కలిగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల మంజూరైన బోర్లు వేయడం సాధ్యం కావడం లేదని తెలిపారు. ​రైతుల విన్నపం: ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గిరిజన రైతుల అభివృద్ధికి అడ్డుపడుతున్న అటవీ శాఖ నిబంధనల విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడి, ఆటంకాలు లేకుండా బోర్ వేల్స్ పనులు పూర్తయ్యేలా చూడాలని మాజీ ఎమ్మెల్యేను కోరారు. మాజీ ఎమ్మెల్యే ​ఆత్రం సక్కు మాట్లాడుతూ : ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, రైతులకు న్యాయం జరిగేలా మరియు అటవీ శాఖ ఆటంకాలు తొలగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *