పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ భారత రాజ్యాంగ నిర్మాత, మహానేత బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు బాదావత్ బాలాజీ మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన విశేష కృషిని స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వాసిరెడ్డి వెంకటేశ్వర్లు , యానరతి మహనరావు మాజీ సర్పంచ్ భుక్య బాలాజీ ఎస్‌కే ఖాసిం పూర్ణకంటి నాగరాజు ఇటుకాల రాజు బాదావత్ నాగేష్ తదితర నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.