స్వచ్చత కోసం కదిలినసాఫ్ట్ వేర్ ఉద్యోగులు,వారికుటుంబ సభ్యులు పర్యావరణ పరిరక్షణ కు కృషి

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 14 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ వారంతా ఉన్నత కుటుంబాలకు చెందిన వారు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చో కుండా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయి,,ఉన్న చెట్లు తరిగి పోయి పర్యావరణ సమతుల్యత దెబ్బ తిని ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతు న్నాయి. సొసైటీలో తమ వంతు పాత్ర పోషించి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకుంటున్నారు. ఇంట్రెక్ ఇండియా, వృక్షిత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యం లో క్లిన్ డ్రైవ్ కార్యక్ర మం చేపట్టారు.ప్రతి శని ఆదివా రాల్లో సభ్యులందరూ కలిసి క్లిన్ డ్రైవ్ లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఏరివి వేస్తున్నారు.అందులో భాగంగా మియా పూర్, అమీన్ పూర్ చెరువు ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.ఈ సందర్భంగా ఫౌండేష న్ సభ్యులు అక్షిత, రిషిక,రోష్నిత్ లు మాట్లాడుతూ తాము ఒక టీంగా ఏర్పడి 2019 నుండి ఇలాంటి డ్రైవ్ కార్యక్రమా లు నిర్వహిస్తున్నామని తెలిపారు.తమ సంస్థలో 5 వేల మంది సభ్యులు ఉన్నార ని,45 నగరాల్లో ఇలాం టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు.పరిసరాల శుభ్రతతో పాటు మొక్కలు నాటుతు న్నా మని పేర్కొన్నారు.పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని,చెట్లను పెంచుకో వాలని కోరారు.పర్యా వరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరా రు.ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించా లని, చెట్లను పెంచు కోవాలని సూచిం చారు. స్వచ్ఛంద సంస్థలు,ప్రజలు ముందుకు రావాలని అందరం కలిసి మన నగరాలను శుభ్రంగా ఉంచుకోవా లనీ అన్నారు.ఈ కార్య క్రమంలో దినేష్ వికాష్ ఆజేష్ శర్మ, భువన్ ఇలస్,మ హునా,యష్ రాజ్,లౌకిక్,మౌనిక,హ రిఎం,భువి,కిత్విక,రాకేష్,నివేదిత,
జిలేక్,సచిన్,కౌశిక్ మరియు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *