పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం కోసిగి టౌన్ లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది.అన్నా క్యాంటీన్ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టిడిపి మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి, మంత్రాల నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న, బిజెపి ఇన్చార్జి ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి హాజరై వీరి చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.కూటమి ప్రభుత్వ నాయకులు జనసేనపార్టీ ఇన్చార్జి వాల్మీకి బి లక్ష్మన్న ,టిడిపి ఇన్చార్జి ఎన్ రాఘవేంద్ర రెడ్డి ,బిజెపి ఇన్చార్జి ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అందరూ కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఇంతకుముందు 207 ఉండేవి ఈరోజు కొత్తవి 62 వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 269 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి.బీద బడుగు వర్గాలకు ఇవి ఎంతో ఉపయోగపరంగా ఉంటాయని అన్నారు. మంత్రాలయం నియోజకవర్గం లో కోసిగి మండలం చాలా వెనుకబడి ఉందని ఇక్కడ ఉపాధి లేక చాలా మంది వలస పోతున్నారని ఇలాంటి టైంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనం పెట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయమని వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్ రామకృష్ణారెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు పల్లిపాడు రాంరెడ్డి, జ్ఞానేష్, టిడిపి సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి, నర్సిరెడ్డి, కోసిగయ్య, వక్రాని వెంకటేశ్వర్లు,జక్కినేని వెంకటేశ్వర్లు,మాలపల్లి లక్ష్మయ్య, చావిడి వెంకటేష్, నాడిగిన అయ్యన్న,మరియు జనసేన పార్టీ కోసిగి మండల అధ్యక్షులు సి వీరారెడ్డి, జనసేన పార్టీ మంత్రాలయం మండల నాయకులు సంగటి ఏసోబు, కోసిగి జనసేన పార్టీ నాయకులు నరసింహులు,మరియు టిడిపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.