కోరుట్ల చేరిన మావోయిస్టు అగ్ర నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి

పయనించే సూర్యుడు, కోరుట్ల ఏప్రిల్ 10 సుమారు నాలుగు దశాబ్దాల అనంతరం కోరుట్ల చేరిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ బుధవారం సాయంత్రం కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో గల తన స్వగృహానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చిననాటి మిత్రులు, బంధువులు ఆయనను కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. 42 సంవత్సరాలుగా ప్రజల పక్షాన అజ్ఞాతంలో దేశ వ్యాప్తంగా ఉద్యమించిన తమ నాయకుడు తిరుపతి అలియాస్ దేవ్ జీ ఎలా వుంటాడు అనే ఉత్సాహంతో కోరుట్ల ప్రజలు చూడడానికి ఆసక్తిగా ఎదురు చూశారు. ఇంటికి చేరుకుని బంధువులను కలిసిన తిరుపతి బావోద్వేగానికి లోనయ్యాడు. ఇంట్లోకి వెళ్లి స్వర్గస్తులైన తన తల్లిదండ్రుల ఫోటోలకు నివాళులు అర్పించారు. అనంతరం తిరుపతి పాత్రికేయులతో మాట్లాడుతూ తాను జనజీవన స్రవంతిలో కలిసిన తరువాత మొదటిసారిగా సొంత ఇంటికి రావడం ఆనందంగా వుందన్నారు. తాను ఉద్యమబాటలో వెళ్లాక తిరిగి మళ్లీ సొంత ఇంటికి వస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నారు. తనను కలవడానికి చిననాటి మిత్రులు బంధువులు రావడంతో సంతోషం వ్యక్తంచేశారు. ప్రస్తుతం తాను తన బంధుమిత్రులను, చిననాటి స్నేహితులను కలవడానికి వచ్చానని ఇకపై తన వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా సామాజిక ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం తాను అప్పట్లో ఎలా పోరాడనో, ఇప్పటికి అదే లక్ష్యం తో ఉంటానని తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ఉంటు ప్రజల సమస్యల పరిష్కరం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *