పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 12 మామిడిపెల్లి లక్ష్మణ్ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే దాగి ఉందని ఆ యువత సరైన దిశలో నడవాలంటే క్రీడలు అత్యంత అవసరమని రాయికల్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ పుర్రె శ్రీధర్ అన్నారు.మహాత్మ జ్యోతిరావ్ బాపూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఆవరణలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాయికల్ శాఖ నిర్వహిస్తున్న మండలస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను జ్యోతిరావు బాపూలే చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి,విద్యార్థులు మొబైల్ ఫోన్ వ్యసనానికి అలవాటు కాకుండా క్రీడలు ఉపయోగపడతాయన్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాదు, మానసిక ధైర్యం, క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ నైపుణ్యాలకు పునాది వేస్తాయి” అని పేర్కొన్నారు.పట్టణ అధ్యక్షులు గుర్రం రత్నాకర్ మాట్లాడుతూ,మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాలను స్ఫూర్తి గా తీసుకోవాలని అన్నారు మైదానంలో చెమటోడ్చే యువతే జీవితంలో విజయం సాధిస్తారని అన్నారు ప్రధానకార్యదర్శి మారంపెల్లి సాయికుమార్ మాట్లాడుతూ క్రీడల వైపు మళ్లిన యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే కాదు, సమాజానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు-ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో పోటీ పడటమే అసలైన విజయమని సూచించారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు పుర్రె శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల నిర్వహణ కు సహాయ సహకారాలు అందజేస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాపురపు నర్సయ్య,సందెల రాజేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు బందెల శ్రీనివాస్,పుర్రె రమేష్ , ప్రతాప్, రాజేందర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.