ఉపాధిహామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 15 మామిడిపెల్లి లక్ష్మణ్ వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధిహామీ పథకం కూలీలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ దేవుని రవి సూచించారు.మంగళవారం రాయికల్ మండలంలోని చెర్లాకొండాపూర్ గ్రామంలో ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీలు పనిచేస్తున్న పని ప్రదేశానికి ఆశ కార్యకర్త తో వెళ్లి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో వేకువ జామునే కూలీలు పనులకు వెళ్లాలని సూచించారు.ఎండ వేడిమి పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలు మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకుంటూ శరీరాన్ని చల్లగా ఉంచుకుంటూ పనులు చేయాలన్నారు.తల తిప్పడం,వాంతులు, విరోచనాలు,అలసట వంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ సలహాలు తీసుకొని చికిత్స పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్,ఫీల్డ్ అసిస్టెంట్ ఇందూరి రాకేష్ ,ఏఎన్ఎం లత, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *